నేడు పాఠశాలలకు సెలవులు
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంతో నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంతో నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవును ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉతర్వులు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
ఈ జిల్లాల్లో...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శఆఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.